తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని ఓబులువారిపల్లి మండలం ముక్కావారిపల్లి పంచాయతీలో ఉన్న బాలుర గురుకుల పాఠశాల ఆవరణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆల్ట్రా హైడెన్సిటీ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైల్వే కోడూరు టీడీపీ ఇన్‌చార్జ్, కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు.
అనంత అరణ్య పద్ధతిలో చేపట్టిన ఈ కార్యక్రమంలో 25 సెంట్ల విస్తీర్ణంలో 16 రకాల మొక్కలను నాటే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచి పచ్చదనాన్ని విస్తరించడమే ఆల్ట్రా హైడెన్సిటీ ప్లాంటేషన్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు.
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ పర్యావరణం మన జీవితానికి మూలాధారమని, దానిని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. మొక్కల పెంపకం ద్వారా స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించడంతో పాటు ప్రకృతి సమతుల్యత కూడా కాపాడబడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చిన ముక్కా రూపానంద రెడ్డి, అరవ శ్రీధర్
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని ఓబులువారిపల్లి మండలం ముక్కావారిపల్లి పంచాయతీలో ఉన్న బాలుర గురుకుల పాఠశాల ఆవరణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆల్ట్రా హైడెన్సిటీ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైల్వే కోడూరు టీడీపీ ఇన్‌చార్జ్, కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు. అనంత అరణ్య పద్ధతిలో చేపట్టిన ఈ కార్యక్రమంలో 25 సెంట్ల విస్తీర్ణంలో 16 రకాల మొక్కలను నాటే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచి పచ్చదనాన్ని విస్తరించడమే ఆల్ట్రా హైడెన్సిటీ ప్లాంటేషన్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ పర్యావరణం మన జీవితానికి మూలాధారమని, దానిని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. మొక్కల పెంపకం ద్వారా స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించడంతో పాటు ప్రకృతి సమతుల్యత కూడా కాపాడబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

