*మైలవరం సర్పంచ్ అభ్యర్థి నివృత్ రావుకు బ్రాహ్మణ సంఘం సంఘీభావం*
*మైలవరం,నవంబర్:-
రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మైలవరం సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న మైలవరం జమీందార్, ద్వారకా తిరుమల దేవస్థానం చైర్మన్ ఎస్.వి. సుధాకరరావు కుమారుడు, దేవస్థానం ఆనువంశిక ధర్మకర్త ఎస్.వి.ఎన్. నివృత్ రావుకు మైలవరం బ్రాహ్మణ సంఘం సభ్యులు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘానికి చెందిన పలువురు సభ్యులు నివృత్ రావును కలిసి తమ మద్దతును, శుభాకాంక్షలను తెలియజేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆయనకు సంఘీభావం ప్రకటిస్తూ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ కార్యక్రమంలో మైలవరం బ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

