పేదలకు పట్టాభిషేకం
మైలవరం దేవుని చెరువులో 35 మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ
ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు కృషితో శాశ్వత హక్కులు
పేదల కళ్లలో ఆనంద భాష్పాలు.. ముందే వచ్చిన దసరా సంబరం
మైలవరం, అక్టోబర్ 1:
దశాబ్దాలుగా సొంతింటి స్థలం కోసం ఎదురుచూస్తున్న పేదల కల మైలవరం పట్టణంలోని దేవుని చెరువులో సాకారమైంది. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారి కృషితో 35 మంది అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు అందడంతో వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. శాశ్వత హక్కులు కల్పించే ఇళ్ల పట్టాలు అందుకోవడంతో తమకు ముందుగానే దసరా పండుగ వచ్చిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.
దశాబ్దాల నిరీక్షణకు తెర
ఏళ్ల తరబడి పలు ప్రభుత్వాలు మారినా తమ సమస్య పరిష్కారం కాలేదని, ఇప్పుడు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారి చొరవతో తమకు ఇళ్ల పట్టాలు లభించాయని లబ్ధిదారులు తెలిపారు. పేదల ఆత్మగౌరవం, ఆర్థిక భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
సీఎం, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం
ఇళ్ల పట్టాలు అందుకున్న అనంతరం లబ్ధిదారులు తమ ఆనందాన్ని ప్రత్యేకంగా వ్యక్తం చేశారు. లంకా లితీష్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారి చిత్రపటాలకు మైలవరంలోని దేవుని చెరువులో గురువారం క్షీరాభిషేకం నిర్వహించారు. తమకు ఇళ్ల పట్టాలు అందేలా కృషి చేసిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే వసంత.
తాము ఎన్నో ప్రభుత్వాలను, ఎంతో మంది ప్రజాప్రతినిధులను చూశామని, అయితే తమ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారం కోసం చొరవ చూపిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని పేద కుటుంబాలకు శాశ్వత హక్కులు కల్పించడంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు కీలక పాత్ర పోషించారని అన్నారు.
పేదలకు సొంతింటి భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరువ చేయడంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు చేస్తున్న కృషి అభినందనీయమని లబ్ధిదారులు పేర్కొన్నారు. మైలవరం చరిత్రలో పేదల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న నాయకుడిగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారిని వారు కొనియాడారు.




