Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం తెలుగుదేశం అభ్యర్థి మూడో వార్డు నెంబర్ అబ్దుల్ రహీం ప్రసారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం తెలుగుదేశం అభ్యర్థి మూడో వార్డు నెంబర్ అబ్దుల్ రహీం ప్రసారం

*ఎన్టీఆర్ జిల్లా మైలవరం..*

*గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ.వసంత వెంకట కృష్ణప్రసాద్ గారి అశీసులతో..*

*ప్రజల ఆశీర్వాదమే అండగా.. గెలుపే లక్ష్యంగా sk. అబ్దుల్ రహీం ప్రచార జోరు!*

*ప్రజలతో మమేకమవుతూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన.*

*ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నవంబర్ 19:*

*మైలవరం 3వ వార్డ్ అభ్యర్థి ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి sk. అబ్దుల్ రహీమ్ తన ప్రచారాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు.*

*గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలతో నేరుగా మమేకమవుతూ, వారి ఆదరణను కోరుతూ ముందుకు సాగారు. ప్రతి ఓటరును ఆత్మీయంగా పలకరిస్తూ తనను ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.*

*మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం శాసనసభ్యులు శ్రీ.వసంత వెంకట కృష్ణప్రసాదు గారి ఆశీస్సులతో బరిలో నిలిచిన sk.అబ్దుల్ రహీమ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు.*

*ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించి, అభివృద్ధి కొనసాగాలంటే కూటమి అభ్యర్థులకు ప్రజలు అండగా నిలవాలని కోరుతున్నారు.*

*ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా!*

*ఎన్నికల్లో గెలుపు కోసం మాత్రమే కాకుండా, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యతతో ముందుకు సాగుతున్నానని sk. అబ్దుల్ రహీమ్ పేర్కొంటున్నారు.*

*ప్రజలు తనపై ఉంచే విశ్వాసానికి తగిన విధంగా పనిచేస్తూ, గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని భరోసా ఇస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నారు.*

*ప్రచారంలో ప్రజల నుంచి లభిస్తున్న స్పందన, ఆశీర్వాదాలు తనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయని, గ్రామ అభివృద్ధి పట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని చెబుతున్నారు. ప్రజల మద్దతుతో విజయాన్ని సాధించాలనే ధృఢ సంకల్పంతో ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.*

*ఈ నేపథ్యంలో మైలవరం 3వ వార్డ్ అభ్యర్థి కి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున తమ అమూల్యమైన ఓటు వేసి తనను గెలిపించాలని sk.అబ్దుల్ రహీమ్ ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు.*

మైలవరం తెలుగుదేశం అభ్యర్థి మూడో వార్డు నెంబర్ అబ్దుల్ రహీం ప్రసారం

మైలవరం తెలుగుదేశం అభ్యర్థి మూడో వార్డు నెంబర్ అబ్దుల్ రహీం ప్రసారం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *