Friday, 4 September 2026
  • Home  
  • మేడిపల్లిలో అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు!
- రంగారెడ్డి

మేడిపల్లిలో అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు!

మేడిపల్లిలో అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు! భక్తిశ్రద్ధల నడుమ ప్రత్యేక పూజలు.. ఉట్టికొట్టి సంబరాలు రైతులు, పాడిపంటలు సుభిక్షంగా ఉండాలని శ్రీకృష్ణుడిని వేడుకున్న భక్తులు యాచారం, సెప్టెంబర్ 4: శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని నక్కర్త–మేడిపల్లి గ్రామ పరిధిలోని పెరుమాండ్ల ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. PRG ఫౌండేషన్ అధ్యక్షులు ప్రొద్దుటూరి రవీందర్ గుప్త ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నక్కర్త–మేడిపల్లి గ్రామ ముచ్చర్ల సంపత్, ఉప సర్పంచ్ దెంది మధుకర్ రెడ్డి, కడ్తాల్ మండల కాంగ్రెస్ పార్టీ ST సెల్ అధ్యక్షులు విస్లావత్ శ్రీను నాయక్ పాల్గొని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. యాదవ సంఘాల యువకులు అరపెల్లి శ్రీకాంత్ యాదవ్, వినోద్ యాదవ్, ప్రశాంత్ యాదవ్ ఉట్టికొట్టి వేడుకల్లో ఉత్సాహాన్ని నింపారు. యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కృష్ణాష్టమి వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతో గ్రామాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో ఆరోగ్యంగా, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని శ్రీకృష్ణుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి మాజీ వార్డు సభ్యులు జమ్మూ మహేందర్, పల్లెచెల్కతండా మాజీ ఉప సర్పంచ్ సీతారాం నాయక్, గ్రామస్తులు కొంగల శ్రీశైలం, వడమోని కిషన్, పల్లెచెల్కతండాకు చెందిన బావూజు నారియ నాయక్, బాలు నాయక్, గోపాల్ నాయక్, ప్రొద్దుటూరి సురేందర్ గుప్త, సాయిరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మేడిపల్లిలో అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు!

భక్తిశ్రద్ధల నడుమ ప్రత్యేక పూజలు.. ఉట్టికొట్టి సంబరాలు

రైతులు, పాడిపంటలు సుభిక్షంగా ఉండాలని శ్రీకృష్ణుడిని వేడుకున్న భక్తులు

యాచారం, సెప్టెంబర్ 4: శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని నక్కర్త–మేడిపల్లి గ్రామ పరిధిలోని పెరుమాండ్ల ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. PRG ఫౌండేషన్ అధ్యక్షులు ప్రొద్దుటూరి రవీందర్ గుప్త ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నక్కర్త–మేడిపల్లి గ్రామ ముచ్చర్ల సంపత్, ఉప సర్పంచ్ దెంది మధుకర్ రెడ్డి, కడ్తాల్ మండల కాంగ్రెస్ పార్టీ ST సెల్ అధ్యక్షులు విస్లావత్ శ్రీను నాయక్ పాల్గొని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.

యాదవ సంఘాల యువకులు అరపెల్లి శ్రీకాంత్ యాదవ్, వినోద్ యాదవ్, ప్రశాంత్ యాదవ్ ఉట్టికొట్టి వేడుకల్లో ఉత్సాహాన్ని నింపారు. యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కృష్ణాష్టమి వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతో గ్రామాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో ఆరోగ్యంగా, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని శ్రీకృష్ణుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మేడిపల్లి మాజీ వార్డు సభ్యులు జమ్మూ మహేందర్, పల్లెచెల్కతండా మాజీ ఉప సర్పంచ్ సీతారాం నాయక్, గ్రామస్తులు కొంగల శ్రీశైలం, వడమోని కిషన్, పల్లెచెల్కతండాకు చెందిన బావూజు నారియ నాయక్, బాలు నాయక్, గోపాల్ నాయక్, ప్రొద్దుటూరి సురేందర్ గుప్త, సాయిరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.