Friday, 25 September 2026
  • Home  
  • మేకల మందలోకి అడవిని వీడి వచ్చిన చుక్కల దుప్పి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మేకల మందలోకి అడవిని వీడి వచ్చిన చుక్కల దుప్పి

దుత్తలూరు మండలం వెంకటంపేట సమీపంలో మేకల మందతో కలిసి చుక్కల దుప్పి కనిపించడం స్థానికులను ఆకట్టుకుంది. మేకలను మేపుతున్న కాపరి తొలుత దానిని మేకపిల్లగా భావించాడు. అయితే దగ్గరకు వెళ్లి పరిశీలించగా అది చుక్కల దుప్పి అని గుర్తించాడు. వెంటనే ఈ విషయాన్ని స్థానికులకు తెలియజేయడంతో పాటు అటవీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ బచ్చల వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకుని దుప్పిని పరిశీలించారు. దుప్పి ఆరోగ్య పరిస్థితిని గమనించిన అనంతరం సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి తరలించి వదిలేందుకు చర్యలు చేపట్టారు. మేకల మందతో కలిసి దుప్పి సంచరించిన దృశ్యాలు స్థానికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.