మరో సకల జనుల సమ్మెలాగా చేస్తాం
తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మిక సంఘాలు హెచ్చరిక
పున్నమి న్యూస్ ప్రతినిధి
21 ఏప్రిల్ 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
ఈ నెల 22వ తేదీ నుండి సమ్మెకు దిగుతామని ప్రకటించిన నేపధ్యంలో, 21వ తేదీ లోపు ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించేందుకు అంగీకరించకపోతే సమ్మె విషయంలో వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పిన కార్మిక సంఘాలు
మరో సకల జనుల సమ్మెలాగా కార్యరూపం దాల్చుతుందని, ప్రైవేట్ సిబ్బందితో తమ సమ్మె నిర్వీర్యం చేయాలని చూస్తే ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసు అని హెచ్చరించిన ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న
అన్ని యూనియన్ల జేఏసీలు, జేఏసీలో లేని కార్మికులు సైతం సమ్మెకు మద్దతు ఇస్తున్నాయని, ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాకపోతే 22వ తేదీ మొదటి షిఫ్ట్ నుండి సమ్మె మొదలవుతుందని కార్మిక సంఘాల వెల్లడి


