మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నేత మనోజ్ జరంగే పాటిల్ మరోసారి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. గత మూడు సంవత్సరాల్లో ఇది ఆయన చేపట్టిన తొమ్మిదో దీక్ష కావడం గమనార్హం. మరాఠా వర్గానికి కున్బీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి ఓబీసీ కోటా ప్రయోజనాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఉద్యమాల్లో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని కూడా కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ముందుకొచ్చి 12 అంశాలతో కూడిన ప్రతిపాదనలు సమర్పించినప్పటికీ, వాటిని పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని జరంగే స్పష్టం చేశారు.

మరాఠా రిజర్వేషన్ల కోసం మరోసారి నిరాహార దీక్ష