మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లె మండలం, రెడ్డివారిపల్లె మోడల్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థిని రజిత (16) కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడింది. శనివారం కిటికీ పక్కన ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థిని తండ్రి రవికుమార్ తెలిపారు. బాలిక కేకలు వేస్తున్నా ప్రిన్సిపల్, టీచర్లు తన బిడ్డను ఆసుపత్రికి తరలించ కుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారని, వెంటనే స్కూలు వద్దకు తాము వెళ్లి తన బిడ్డను మదనపల్లెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించా మన్నారు.

మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లె మండలం, రెడ్డివారిపల్లె మోడల్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థిని రజిత (16) కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడింది.