ముద్దనూరు : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. 36 ప్రాథమిక పాఠశాలలు, 6 ఉన్నత పాఠశాలల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికలు మండల తహసిల్దార్ అలీ ఖాన్, మండల అభివృద్ధి అధికారిని రాధాకృష్ణ వేణి, ఆధ్వర్యంలో సిఐ నగేష్ బాబు ప్రతిష్ట బందోబస్తు తో పాఠశాలల కమిటీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని మండల విద్యాశాఖాధి కారి నాగేశ్వర నాయక్ పేర్కొన్నారు. ప్రతి పాఠశాలకు ఒక ఎస్ ఎం సి చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు విద్యార్థుల సంఖ్యను బట్టి గరిష్టంగా 12 మంది కమిటీ సభ్యు లను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. ఎస్ ఎం సి కమిటీ కాలపరిమితి రెండు సంవత్సరాలు ఉంటుందని ఈ కాలంలో కమిటీ సభ్యులు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి వాటిని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై కూడా ఉందన్నారు. చైర్మన్లు వైస్ చైర్మన్, కమిటీ సభ్యు లు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో మరింత బలోపేతం కావాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలోనే ఉన్నతమైన విద్య లభిస్తుందని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి తోడ్పడాలని కోరారు
మండలంలో ప్రశాంతంగా ఎస్ఎంసి ఎన్నికలు