రఘునాథపాలెం / ఖమ్మం
ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ నెల్లూరి కోటేశ్వరరావు ఆశీస్సులతో, జిల్లా సీనియర్ నాయకులు శ్రీ వల్లభనేని పుల్లయ్య ఆదేశాల మేరకు మంచుకొండ గ్రామంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. OBC మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ గంధసిరి వీరభద్రం గౌడ్ ఆధ్వర్యంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం, కేక్ కటింగ్, టపాసులు కాల్చడం, దీపాలు వెలిగించడం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సీనియర్ నాయకులు, మంచుకొండ బీజేపీ వార్డు మెంబర్ శ్రీ ధర్మసోత్ రామారావు పాల్గొన్నారు. ST మోర్చా జిల్లా నాయకులు, వార్డు మెంబర్ శ్రీ లకావత్ రమేష్, కిసాన్ మోర్చా మీడియా కన్వీనర్ లకావత్ నవీన్, సుమన్, దారావత్ గణేష్, భూక్యా నాగా, శంకర్, గ్రామస్తులు పాల్గొన్నారు.



