మయన్మార్ అధ్యక్షుడు భారత్ పర్యటనకు రానున్న నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాలపై కొత్త చర్చలు ప్రారంభమయ్యాయి. భద్రత, వాణిజ్యం, సరిహద్దు అభివృద్ధి, కనెక్టివిటీ అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి.
ఇరు దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని భారత్ ఆకాంక్షిస్తున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.


