*దొరవారిసత్రం, తిరుపతి జిల్లా:*
గూడూరు నుండి సూళ్లూరుపేట వైపు వెళ్తున్న బొలెరో వాహనం దొరవారిసత్రం హైవేలో మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది.
డ్రైవర్‌కు నిద్ర రావడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని వాహనం బోల్తా పడింది. వాహనంలో ఉన్న సరుకు బస్తాలన్నీ రోడ్డుపై పడిపోయాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయని సమాచారం. పెద్ద ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.


