వార్త ముఖ్యాంశాలు
- బైరవరం గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
- ఉదయం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
- పురుషులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బైరవరం గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పురుషులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. బైరవరం గ్రామంలో మొత్తం 85.54 శాతం పోలింగ్ నమోదై రికార్డు స్థాయి ఓటింగ్‌గా నిలిచింది. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అభ్యర్థులు, గ్రామస్థులు ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.