Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు: ఓటరు పేరులో పదం తేడా.. పోలింగ్ కేంద్రం వద్ద వాగ్వాదం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరు: ఓటరు పేరులో పదం తేడా.. పోలింగ్ కేంద్రం వద్ద వాగ్వాదం

వార్త ముఖ్యాంశాలు

  • సీతారామపురం: నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం పబ్బులేటిపల్లిలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటరు పేరులో తేడా వివాదానికి దారితీసింది.
  • ఓటరు జాబితాలో నమోదైన పేరులో ఒక పదం భిన్నంగా ఉండటంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
  • దీంతో పోలింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సీతారామపురం: నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం పబ్బులేటిపల్లిలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటరు పేరులో తేడా వివాదానికి దారితీసింది. ఓటరు జాబితాలో నమోదైన పేరులో ఒక పదం భిన్నంగా ఉండటంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వివాదం క్రమంగా తీవ్రతరం కావడంతో అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది వెంటనే జోక్యం చేసుకున్నారు. ఇరువర్గాల వారిని అక్కడి నుంచి చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసుల చర్యలతో ఉద్రిక్తత సద్దుమణిగింది. అనంతరం పోలింగ్ కేంద్రం వద్ద సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *