ఆత్మకూరు . అక్టోబర్ 1 పున్నమి నెల్లూరు జిల్లా కో ఆర్డినేటర్ పి.విజయ్
ఆత్మకూరు: బసవరాజుపాళెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో విద్యా కమిటీ చైర్మన్‌గా దీపోగు మల్లికార్జున, వైస్ చైర్మన్‌గా గురునాధం పద్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌కు పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడం, పాఠశాలలో మౌలిక వసతుల మెరుగుదలకు విద్యా కమిటీ కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు. కమిటీ సభ్యుల సహకారంతో పాఠశాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని నూతన చైర్మన్, వైస్ చైర్మన్ తెలిపారు.


