వార్త ముఖ్యాంశాలు
- సెప్టెంబర్ 27, 2026 రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదగాలన్న ఉద్దేశంతో కుప్పంలో పెద్ద ఎత్తున పౌల్ట్రీ షెడ్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు.
- ఇందుకు అవసరమైన అన్ని అనుమతులను రియల్ టైమ్లో మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
- రాష్ట్రంలో పౌల్ట్రీ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రత్యేకమైన పాలసీని తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
సెప్టెంబర్ 27, 2026
రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదగాలన్న ఉద్దేశంతో కుప్పంలో పెద్ద ఎత్తున పౌల్ట్రీ షెడ్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఇందుకు అవసరమైన అన్ని అనుమతులను రియల్ టైమ్లో మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పౌల్ట్రీ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రత్యేకమైన పాలసీని తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. డైరీ, పౌల్ట్రీ, ఉద్యానవనం, సెరీకల్చర్ వంటి రంగాలను ప్రోత్సహిస్తూ రైతులకు మరిన్ని అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ప్రజల్లో ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రొటీన్ అధికంగా ఉండే కోడిమాంసం, గుడ్ల వినియోగం పెరుగుతోందని చంద్రబాబు తెలిపారు. దీంతో పౌల్ట్రీ రంగానికి భవిష్యత్లో మరింత డిమాండ్ ఉండే అవకాశం ఉందన్నారు.