పొగాకు రైతుల సమస్యలపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖాముఖీ.. పరిష్కారానికి కృషి చేస్తామని హామీ
ఉదయగిరి నియోజకవర్గంలోని పొగాకు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వింజమూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రైతులతో ముఖాముఖీ సమావేశం నిర్వహించారు. రైతులు గిట్టుబాటు ధరలు లేకపోవడం, సాగు వ్యయాలు పెరగడం, మార్కెటింగ్‌లో ఇబ్బందులు, మధ్యవర్తుల జోక్యంపై ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. న్యాయమైన ధరలు అందేలా సంబంధిత శాఖ అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.

పొగాకు రైతుల సమస్యలపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖాముఖీ.. పరిష్కారానికి కృషి చేస్తామని హామీ
పొగాకు రైతుల సమస్యలపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖాముఖీ.. పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఉదయగిరి నియోజకవర్గంలోని పొగాకు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వింజమూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రైతులతో ముఖాముఖీ సమావేశం నిర్వహించారు. రైతులు గిట్టుబాటు ధరలు లేకపోవడం, సాగు వ్యయాలు పెరగడం, మార్కెటింగ్‌లో ఇబ్బందులు, మధ్యవర్తుల జోక్యంపై ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. న్యాయమైన ధరలు అందేలా సంబంధిత శాఖ అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.

