పున్నమి వార్త దినపత్రికలో ప్రచురితమైన కథనానికి విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. విద్యుత్ స్తంభాల చుట్టూ అల్లుకున్న పిచ్చి మొక్కలు, తీగలను తొలగించేందుకు ఏఈ ఖాజా ఆదివారం సిబ్బందితో కలిసి ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్తంభాల వద్ద పెరిగిన చెట్లు, తీగలను తొలగించి విద్యుత్ లైన్లకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా పట్టపగలే వెలుగుతున్న విద్యుత్ దీపాలను గుర్తించి, వాటికి అవసరమైన మరమ్మతులు చేయించారు. ప్రజల సమస్యలను పత్రిక ద్వారా వెలుగులోకి తీసుకురాగానే అధికారులు స్పందించి చర్యలు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పున్నమి వార్త దినపత్రిక పాత్రను పలువురు అభినందించారు.

పున్నమి వార్తకు స్పందన.. విద్యుత్ సమస్యలకు పరిష్కారం