వార్త ముఖ్యాంశాలు
- 9 నెలల గర్భిణీలా కనిపించిన మహిళ..
- కడుపులో 3.76 కిలోల భారీ కణితి మోరి సుబ్బమ్మ మిషన్ ఆసుపత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్స డాక్టర్ బి.ఆర్.
- అంబేద్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి: మండలం మోరి సుబ్బమ్మ మిషన్ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.
9 నెలల గర్భిణీలా కనిపించిన మహిళ.. కడుపులో 3.76 కిలోల భారీ కణితి
మోరి సుబ్బమ్మ మిషన్ ఆసుపత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్స
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి: మండలం మోరి సుబ్బమ్మ మిషన్ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 35 ఏళ్ల మహిళ గర్భాశయంలో భారీ కణితితో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చారు. కణితి పరిమాణం పెద్దగా ఉండటంతో ఆమె 9 నెలల గర్భిణీలా కనిపించినట్లు వైద్యులు తెలిపారు.
కణితి కారణంగా కిడ్నీలు, మూత్రనాళాలపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో వైద్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ లతాపాల్ పర్యవేక్షణలో వైద్య బృందం చికిత్స ప్రారంభించింది.
ముందుగా ఒంగోలుకు చెందిన యూరాలజిస్ట్ డాక్టర్ నోయల్ జాన్ మూత్రనాళాల్లో స్టెంట్లు అమర్చారు. అనంతరం రాయవెల్లూరుకు చెందిన డాక్టర్ పాల్ ఇమ్మాన్యుయేల్ శస్త్రచికిత్స నిర్వహించి గర్భసంచి నుంచి 3.76 కిలోల బరువున్న భారీ కణితిని విజయవంతంగా తొలగించారు.
శస్త్రచికిత్స అనంతరం రోగికి నొప్పి నియంత్రణ కోసం డాక్టర్ సృజన ఆధ్వర్యంలో ఎపిడ్యూరల్ క్యాథటర్ అమర్చారు. అలాగే రెండు యూనిట్ల రక్తం ఎక్కించారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బృందాన్ని ఆసుపత్రి చైర్మన్ నల్లి డార్విన్ అభినందించారు.