Saturday, 26 September 2026
  • Home  
  • పి.గన్నవరంలో సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్‌
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పి.గన్నవరంలో సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్‌

అంబేద్కర్ కోనసీమ జిల్లా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెలరోజుల పాటు నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పి.గన్నవరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)లో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ మెగా వైద్య శిబిరాన్ని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. శిబిరంలో ప్రజలకు వివిధ రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందించారు. అలాగే సీజనల్ వ్యాధులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ.. 70 ఏళ్లకు పైబడినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. ఆరోగ్యం పట్ల ప్రధాని తీసుకునే జాగ్రత్తలు ఇతర దేశాల అధినేతలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. తనలాగే దేశ ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ తన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించాలని సూచించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు ఈ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెలరోజుల పాటు నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పి.గన్నవరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)లో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు.

ఈ మెగా వైద్య శిబిరాన్ని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. శిబిరంలో ప్రజలకు వివిధ రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందించారు. అలాగే సీజనల్ వ్యాధులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ.. 70 ఏళ్లకు పైబడినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. ఆరోగ్యం పట్ల ప్రధాని తీసుకునే జాగ్రత్తలు ఇతర దేశాల అధినేతలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. తనలాగే దేశ ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ తన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించాలని సూచించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు ఈ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.