నాల్గు దిక్కులలో నడయాడె భాష నా భాష! అమ్మ గర్భగుడిలో పురుడోసుకున్నదే నా భాష! ఆ హిమాద్రి నుండి జాలువారే మంచు బిందువుల చల్లదనంలో జీవం పోసుకున్న పాదాల సముదాయమే కదా! నా భాష!
జీవ నదుల ప్రవాహ సవ్వడి వర్ణనే కదా!నా భాష!
జలాచారాల వర్ణనకు,పురిటి గడ్డ యాసకు ప్రాణమే కదా!నా భాష!
పురాణ,ఇతిహాసాల అర్థాలకు, జ్ఞాన సమపార్జునకు వెలుగే కదా!నా భాష!
అందుకే—
ప్రేగు ముడి వీడి,ప్రాణం పోసుకుని,ప్రపంచమంతా పయనించే ప్రతి ప్రాణి, పసిడి కన్నా మిన్నైన పసిభాషను కాపాడుకుందాం —కె. రెడ్డప్ప (DSR హై స్కూల్, అల్లూరు )
పసిడి (మాతృ )భాష
నాల్గు దిక్కులలో నడయాడె భాష నా భాష! అమ్మ గర్భగుడిలో పురుడోసుకున్నదే నా భాష! ఆ హిమాద్రి నుండి జాలువారే మంచు బిందువుల చల్లదనంలో జీవం పోసుకున్న పాదాల సముదాయమే కదా! నా భాష! జీవ నదుల ప్రవాహ సవ్వడి వర్ణనే కదా!నా భాష! జలాచారాల వర్ణనకు,పురిటి గడ్డ యాసకు ప్రాణమే కదా!నా భాష! పురాణ,ఇతిహాసాల అర్థాలకు, జ్ఞాన సమపార్జునకు వెలుగే కదా!నా భాష! అందుకే— ప్రేగు ముడి వీడి,ప్రాణం పోసుకుని,ప్రపంచమంతా పయనించే ప్రతి ప్రాణి, పసిడి కన్నా మిన్నైన పసిభాషను కాపాడుకుందాం —కె. రెడ్డప్ప (DSR హై స్కూల్, అల్లూరు )

