శ్రీ కాళహస్తి, జూన్ 28, (పున్నమి న్యూస్) : జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలోని పలు కేంద్రాల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ప్రశంసనీయమైన సేవలు అందించారు. భాస్కర్ పేట మునిసిపల్ పాఠశాలకు చెందిన 30 మంది స్కౌట్స్, గైడ్స్ విద్యార్థులు వియ్యాంపల్లి అంగన్ వాడీ కేంద్రం, హనుమాన్ జంక్షన్, సాలిపేట శ్రీరామ మందిరం, భాస్కర్ పేట మునిసిపల్ పాఠశాలల వద్ద ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలలో చురుగ్గా పాల్గొన్నారు. చిన్నారులను కేంద్రాలకు తీసుకురావడం, పోలియో చుక్కల ప్రాధాన్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో వీరు కీలక పాత్ర పోషించారు. ఏపీజే అబ్దుల్ కలాం ఓపెన్ ట్రూప్ స్కౌట్ మాస్టర్ ఎస్.కె. అజారుద్దీన్ ఆధ్వర్యంలో సాగిన ఈ సేవా కార్యక్రమాలను స్థానిక అధికారులు, ప్రజలు ఎంతగానో అభినందించారు.

పల్స్ పోలియో కేంద్రాల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు