వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరులో ఒక్కసారిగా భారీ వర్షం నెల్లూరు: నగరంలో సోమవారం రాత్రి అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది.
- ఉదయం నుంచి మంచు ప్రభావం కనిపించగా, మధ్యాహ్నానికి వాతావరణం సాధారణ స్థితికి చేరుకుంది.
- మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్వల్పంగా వర్షం పడింది.
నెల్లూరులో ఒక్కసారిగా భారీ వర్షం
నెల్లూరు: నగరంలో సోమవారం రాత్రి అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మంచు ప్రభావం కనిపించగా, మధ్యాహ్నానికి వాతావరణం సాధారణ స్థితికి చేరుకుంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్వల్పంగా వర్షం పడింది. ఆ తర్వాత ఆకాశం నిర్మలంగా మారింది.అయితే రాత్రి సమయంలో ఒక్కసారిగా ఆకాశం దట్టమైన మేఘాలతో కమ్ముకోవడంతో భారీ వర్షం ప్రారంభమైంది. కొద్దిసేపటికే వర్షం తీవ్రత పెరగడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు కాలువల్లోకి చేరి, కొన్ని చోట్ల కాలువలు పొంగిపొర్లాయి. అకస్మాత్తుగా మారిన వాతావరణంతో నగరవాసులు ఆశ్చర్యానికి గురయ్యారు.