వార్త ముఖ్యాంశాలు
- నిర్మల్ జిల్లా అక్టోబర్ 19 (పున్నమి ప్రతినిధి) నిర్మల్, అక్టోబర్ 19: దసరా, బతుకమ్మ, దుర్గాదేవి నిమజ్జనోత్సవాల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి తెలిపారు.
- బంగల్‌పేట్ మహాలక్ష్మి ఆలయం, వినాయక సాగర్ వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.
- విగ్రహాల నిమజ్జనానికి క్రేన్లు, శమీ పూజ, రావణ దహన కార్యక్రమాల కోసం విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
నిర్మల్ జిల్లా అక్టోబర్ 19 (పున్నమి ప్రతినిధి)
నిర్మల్, అక్టోబర్ 19: దసరా, బతుకమ్మ, దుర్గాదేవి నిమజ్జనోత్సవాల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి తెలిపారు. బంగల్‌పేట్ మహాలక్ష్మి ఆలయం, వినాయక సాగర్ వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. విగ్రహాల నిమజ్జనానికి క్రేన్లు, శమీ పూజ, రావణ దహన కార్యక్రమాల కోసం విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ద్విచక్ర వాహనదారులు గాంధీ చౌక్, విశ్వనాథ్‌పేట మార్గాలను, కార్లు, ఆటోలలో వచ్చేవారు కలెక్టరేట్ మార్గాన్ని వినియోగించాలని సూచించారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు, మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారి హరిభూషణ్, కౌన్సిలర్ పెండాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.