Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

నాగులకట్ట ఆలయంలో మంత్రి ఫరూక్ అన్నదానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నాగులకట్ట ఆలయంలో మంత్రి ఫరూక్ అన్నదానం

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల:పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్‌ నాగులకట్ట శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది.
  • రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
  • అనంతరం తన సొంత ఖర్చులతో భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు.

నంద్యాల:పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్‌ నాగులకట్ట శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తన సొంత ఖర్చులతో భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు.
ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ.. ఆకలి తీర్చే అన్నదానం మహోన్నతమైన సేవ అని, ప్రతి ఒక్కరూ తమ వంతుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొని సమాజంలో సోదరభావాన్ని పెంపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త పబ్బతి వేణు, ఆలయ కమిటీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *