నర్సంపేట పట్టణంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బీసీ సంక్షేమ సంఘం, సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ గోవిందు కుమారస్వామి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎస్సై రాజన్ బాబు మాట్లాడుతూ, శ్రీనివాస్ ముదిరాజ్ తన జన్మదినాన మరణానంతరం నేత్ర, అవయవ దానానికి ముందుకు రావడం సమాజానికి గొప్ప స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. ఆయనతో పాటు చింతల కళావతి, పిట్టల కవితలు కూడా నేత్రదానానికి అంగీకరించడంతో, ప్రతినిధులు వారికి ప్రశంసా పత్రాలు, ఐడీ కార్డులు అందజేసి అభినందించారు. సదాశయ ఫౌండేషన్ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్. దళపతి, వన ప్రేమ అవార్డు గ్రహీత నల్లగొండ సమ్మయ్య, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు నమిండ్ల స్వామి, కుటుంబ సభ్యులు మరియు పలువురు బీసీ, స్వచ్ఛంద సంస్థల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నర్సంపేటలో ఘనంగా డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు
నర్సంపేట పట్టణంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బీసీ సంక్షేమ సంఘం, సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ గోవిందు కుమారస్వామి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్సై రాజన్ బాబు మాట్లాడుతూ, శ్రీనివాస్ ముదిరాజ్ తన జన్మదినాన మరణానంతరం నేత్ర, అవయవ దానానికి ముందుకు రావడం సమాజానికి గొప్ప స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. ఆయనతో పాటు చింతల కళావతి, పిట్టల కవితలు కూడా నేత్రదానానికి అంగీకరించడంతో, ప్రతినిధులు వారికి ప్రశంసా పత్రాలు, ఐడీ కార్డులు అందజేసి అభినందించారు. సదాశయ ఫౌండేషన్ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్. దళపతి, వన ప్రేమ అవార్డు గ్రహీత నల్లగొండ సమ్మయ్య, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు నమిండ్ల స్వామి, కుటుంబ సభ్యులు మరియు పలువురు బీసీ, స్వచ్ఛంద సంస్థల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

