Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

దివ్యాంగుడు వెంకన్నకు ట్రై సైకిల్ అందజేత. పాల్గొన్న బిజెపి నేత కొండపల్లి శ్రీధర్ రెడ్డి.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దివ్యాంగుడు వెంకన్నకు ట్రై సైకిల్ అందజేత. పాల్గొన్న బిజెపి నేత కొండపల్లి శ్రీధర్ రెడ్డి.

ముదిగొండ / ఖమ్మం

ముదిగొండ మండలం మాధాపురం గ్రామంలో దివ్యాంగుడు వెంకన్నకు ట్రై సైకిల్ అందజేసే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ మాజీ కిసాన్ మోర్చా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్, బీజేపీ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డితో పాటు గ్రామ బీజేపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దివ్యాంగుడు వెంకన్నకు ట్రై సైకిల్‌ను అందజేసి, అతని అవసరాలకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా కొండపల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, దివ్యాంగులకు సహాయం అందించడం అభినందనీయమన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాన్ని చేపట్టిన వేణుగోపాల్ రెడ్డి, గ్రామ బీజేపీ కుటుంబ సభ్యులను ఆయన హృదయపూర్వకంగా అభినందించారు. భవిష్యత్తులోనూ ప్రజాసేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.

దివ్యాంగుడు వెంకన్నకు ట్రై సైకిల్ అందజేత. పాల్గొన్న బిజెపి నేత కొండపల్లి శ్రీధర్ రెడ్డి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *