శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థిగా నెలపాటి శ్రావణ్ కుమార్ పేరు ఖరారైనట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం.స్థానిక నాయకుల కథనం ప్రకారం, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఆశీస్సులు, మద్దతుతో శ్రావణ్ కుమార్ను బరిలోకి దించేందుకు నిర్ణయం తీసుకున్నారు.గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా తాను ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్లనున్నట్లు శ్రావణ్ కుమార్ అనుచర వర్గాలు వెల్లడించాయి.ఆయన అభ్యర్థిత్వం ఖరారు కావడంతో స్థానిక టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
