దగదర్తి బిట్-1 ఎంపీటీసీ స్థానానికి దివంగత మాలేపాటి సుబ్బానాయుడు సతీమణి మాలేపాటి భవాని నామినేషన్ దాఖలు చేశారు. ఆమె తన కుమారుడు లోకేష్‌తో కలిసి నామినేషన్ కేంద్రానికి చేరుకుని అధికారులకు పత్రాలు సమర్పించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీపీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు భవాని సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆమె నామినేషన్‌తో దగదర్తి మండలంలో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.
