Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ASIFABAD

తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపిక

ఈ నెల 03.09.2026 నుంచి 07.09.2026 వరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం భిలాయిలో జరగనున్న 45వ సబ్-జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గోలేటి గ్రామానికి చెందిన సింగరేణి పాఠశాల విద్యార్థులు పుదరి సిరి, ఎం. కృష్ణ లోకనందులు తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు.
వీరిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, సెక్రటరీ ఎస్. తిరుపతి, జిల్లా ఒలింపిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్. నారాయణ రెడ్డి, జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంయుక్త కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు, సింగరేణి పాఠశాల హెడ్‌మాస్టర్ ఎం. రవితేజ, పీఈటీ కె. భాస్కర్, వి. మహేందర్, ఆర్.వి. రామకృష్ణ రెడ్డి, ఆర్. శ్రీనివాస్ రెడ్డి, కుమ్మరి మల్లేశ్, కె. నరేష్, జి. శ్రీధర్, వి. సతీష్ అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *