ఖమ్మం ఆగష్టు
(పున్నమి న్యూస్ )
ఖమ్మం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 75 డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసుల్లో స్పెషల్ మొబైల్ కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. ఒక వాహనదారుడికి ఏడు రోజుల జైలు శిక్ష విధించగా, మరో 74 మంది వాహనదారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.7.40 లక్షల జరిమానా విధిస్తూ స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి బి. నాగలక్ష్మి తీర్పు చెప్పారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బెల్లం సత్యనారాయణ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. వాహనదారులు తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసుల ప్రాసిక్యూషన్‌లో సమర్థంగా పనిచేసిన అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి సురక్షిత రహదారి ప్రయాణానికి సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

