వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు నగరంలోని ఎనెల్ హాస్పిటల్ అధినేత దశరథ నాగేంద్ర ప్రసాద్ గారి కుమార్తె,ప్రముఖ న్యూరాలజిస్ట్,ఎనెల్ హాస్పిటల్ డైరెక్టర్ శ్రీమతి డాక్టర్ లావణ్య కుంకాల గారు ఇటీవల ఆకస్మిక మృతి చెందడం బాధాకరమని,వారి కుటుంబ సభ్యులకు ప్రజాసత్తా తరపున తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ప్రజాసత్తా వ్యవస్థాపక,జాతీయ…
- అనంతరం ఆమె తండ్రి దశరథ నాగేంద్ర ప్రసాద్ గారిని,కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియచేసారు.వారికి భగవంతుడు ధైర్యం,ఆదరణ,ఓదార్పు,నెమ్మది,శాంతి,సమాధానం కలిగించాలని, శోకతప్త హృదయాలతో బాధపడుతున్న వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం కలిగించాలని పులగర శోభనబాబు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
నెల్లూరు నగరంలోని ఎనెల్ హాస్పిటల్ అధినేత దశరథ నాగేంద్ర ప్రసాద్ గారి కుమార్తె,ప్రముఖ న్యూరాలజిస్ట్,ఎనెల్ హాస్పిటల్ డైరెక్టర్ శ్రీమతి డాక్టర్ లావణ్య కుంకాల గారు ఇటీవల ఆకస్మిక మృతి చెందడం బాధాకరమని,వారి కుటుంబ సభ్యులకు ప్రజాసత్తా తరపున తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ప్రజాసత్తా వ్యవస్థాపక,జాతీయ అధ్యక్షులు పులగర శోభనబాబు తెలిపారు.సోమవారం నెల్లూరులోని ఇస్కాన్ సిటీలో ఉన్న వారి వాసానికి వెళ్లి స్వర్గీయ డాక్టర్ శ్రీమతి లావణ్య కుంకాల గారి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె తండ్రి దశరథ నాగేంద్ర ప్రసాద్ గారిని,కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియచేసారు.వారికి భగవంతుడు ధైర్యం,ఆదరణ,ఓదార్పు,నెమ్మది,శాంతి,సమాధానం కలిగించాలని, శోకతప్త హృదయాలతో బాధపడుతున్న వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం కలిగించాలని పులగర శోభనబాబు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్