వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి: పట్టణ శివారులోని సీతారామపురం మార్గంలో జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు.
- మార్కాపురం జిల్లా డీజీ పేట నుంచి నలుగురు వ్యక్తులు కారులో ఉదయగిరికి బయలుదేరారు.
- ఈ క్రమంలో ఉదయగిరి సమీపానికి చేరుకోగానే కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని రహదారి పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది.
ఉదయగిరి: పట్టణ శివారులోని సీతారామపురం మార్గంలో జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. మార్కాపురం జిల్లా డీజీ పేట నుంచి నలుగురు వ్యక్తులు కారులో ఉదయగిరికి బయలుదేరారు. ఈ క్రమంలో ఉదయగిరి సమీపానికి చేరుకోగానే కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని రహదారి పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. ప్రమాద సమయంలో కారులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంతో స్థానికులు అప్రమత్తమయ్యారు.