Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

డబుల్ ఇంజిన్ సర్కార్‌పై ప్రజలకు నమ్మకం.. పరిశ్రమల రాకకు అదే కారణం వైసీపీ ఐదేళ్ల పాలన విధ్వంసం, కక్ష సాధింపులక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డబుల్ ఇంజిన్ సర్కార్‌పై ప్రజలకు నమ్మకం.. పరిశ్రమల రాకకు అదే కారణం వైసీపీ ఐదేళ్ల పాలన విధ్వంసం, కక్ష సాధింపులక

గాజువాక, అక్టోబర్ 31 (పున్నమి ప్రతినిధి):

జీవీఎంసీ ఎన్నికల ప్రచారం ముగింపు నేపథ్యంలో గాజువాక టీడీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జనసేన గాజువాక ఇన్‌ఛార్జి కోన తాతారావు, బీజేపీ గాజువాక కోఆర్డినేటర్ కర్ణంరెడ్డి నరసింహారావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని 22 మంది కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యతను కూటమి శ్రేణులన్నీ భుజాన వేసుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న డబుల్ ఇంజిన్ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, అందుకే పెద్ద ఎత్తున పరిశ్రమలు రాష్ట్రానికి తరలివస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు కూటమికి మద్దతు తెలపాలని కోరారు.

గత ఐదేళ్ల వైసీపీ పాలన కక్ష సాధింపులు, విధ్వంసానికే పరిమితమైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రూ.4 వేల పింఛన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఎక్కడికి వెళ్లినా మహిళలు ప్రభుత్వ పథకాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ మద్దతు తెలుపుతున్నారని అన్నారు.

ఇటీవల సంభవించిన తుఫాన్లను ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో, వివిధ శాఖలను సమన్వయం చేస్తూ సమర్థవంతంగా ఎదుర్కొందని, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ప్రాధాన్యత ఇచ్చిందని పల్లా పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

డబుల్ ఇంజిన్ సర్కార్‌పై ప్రజలకు నమ్మకం.. పరిశ్రమల రాకకు అదే కారణం వైసీపీ ఐదేళ్ల పాలన విధ్వంసం, కక్ష సాధింపులక

డబుల్ ఇంజిన్ సర్కార్‌పై ప్రజలకు నమ్మకం.. పరిశ్రమల రాకకు అదే కారణం వైసీపీ ఐదేళ్ల పాలన విధ్వంసం, కక్ష సాధింపులక

డబుల్ ఇంజిన్ సర్కార్‌పై ప్రజలకు నమ్మకం.. పరిశ్రమల రాకకు అదే కారణం వైసీపీ ఐదేళ్ల పాలన విధ్వంసం, కక్ష సాధింపులక

Leave a comment

Your email address will not be published. Required fields are marked *