Friday, 17 July 2026
  • Home  
  • జిల్లా సాగునీటి పరిస్థితులపై సమీక్షా సమావేశం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జిల్లా సాగునీటి పరిస్థితులపై సమీక్షా సమావేశం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సాగునీటి సమీక్ష సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ రావిరాల మహేష్ కుమార్, శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, జిల్లాలోని శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ జిల్లాలోని ప్రతి ఆయకట్టుకు సాగునీరు అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నీటి నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించిన సాగునీటి సమస్యలను ప్రభుత్వ విప్, శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా కాలువల నిర్వహణ, నీటి పంపిణీ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించి, తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.మంత్రి ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించిన అంశాలను సానుకూలంగా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.