వార్త ముఖ్యాంశాలు
- మార్కాపురం జిల్లా District Career and Mental Health Counsellors బృందం జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కెరీర్ మార్గదర్శకత్వం, మానసిక ఆరోగ్య అవగాహన, కౌన్సిలింగ్ సేవలు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి…
- పాఠశాలల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు మరియు కెరీర్ అవగాహన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన సహకారంపై కూడా చర్చ జరిగింది.విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం జిల్లా విద్యాశాఖతో సమన్వయంతో పనిచేయడానికి కౌన్సిలర్లు తమ నిబద్ధతను తెలియజేయగా, DEO గారు కూడా సానుకూలంగా స్పందించి…
మార్కాపురం జిల్లా District Career and Mental Health Counsellors బృందం జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కెరీర్ మార్గదర్శకత్వం, మానసిక ఆరోగ్య అవగాహన, కౌన్సిలింగ్ సేవలు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం నిర్వహించనున్న కార్యక్రమాలపై చర్చించారు. పాఠశాలల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు మరియు కెరీర్ అవగాహన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన సహకారంపై కూడా చర్చ జరిగింది.
విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం జిల్లా విద్యాశాఖతో సమన్వయంతో పనిచేయడానికి కౌన్సిలర్లు తమ నిబద్ధతను తెలియజేయగా, DEO గారు కూడా సానుకూలంగా స్పందించి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.