Friday, 12 June 2026
  • Home  
  • జిల్లా ఆసుపత్రి పక్కన ఎస్టీ కాలనీలో పకడ్బందీగా ‘ఫ్రైడే – డ్రైడే’
- News - ఆంధ్రప్రదేశ్ - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లా ఆసుపత్రి పక్కన ఎస్టీ కాలనీలో పకడ్బందీగా ‘ఫ్రైడే – డ్రైడే’

దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణకు ప్రజల సహకారం అవసరం: హెచ్ఈవో సుధాకర్ ఆత్మకూరు, జూన్ 12 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): కీటక జనిత వ్యాధులను పూర్తిగా నియంత్రించడంలో నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో నిలవాలని జిల్లా మలేరియా అధికారి ఎం. సింహాచలం పిలుపునిచ్చారు. ఈ మేరకు వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నివారణకు ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది.ఇందులో భాగంగా శుక్రవారం ఆత్మకూరు యూపీహెచ్సీ అరుంధతివాడ పరిధిలోని నెల్లూరుపాలెం ఎస్టీ కాలనీలో ‘ఫ్రైడే – డ్రైడే’ (శుక్రవారం పొడి రోజు) కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (హెచ్ఈవో) సుధాకర్ క్షేత్రస్థాయిలో సందర్శించి, సిబ్బంది చేపడుతున్న చర్యలను పరిశీలించారు.ఈ సందర్భంగా స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో ప్రజలను ఉద్దేశించి హెచ్ఈవో సుధాకర్ మాట్లాడుతూ ప్రతి వారం నిర్వహించే ‘ఫ్రైడే – డ్రైడే’ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడటం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు.దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి కీటక జనిత వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండే పాత్రలు, టైర్లు, కొబ్బరి చిప్పలు వంటి వాటిని తొలగించాలని తెలిపారు.ఆరోగ్య శాఖ చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్న ఆయన, వ్యాధుల నియంత్రణలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చిన మహిళలు, స్థానిక ప్రజలకు కీటక జనిత వ్యాధుల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ జి. రవీందర్ రెడ్డి, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, స్థానిక కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణకు ప్రజల సహకారం అవసరం: హెచ్ఈవో సుధాకర్

ఆత్మకూరు, జూన్ 12 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):

కీటక జనిత వ్యాధులను పూర్తిగా నియంత్రించడంలో నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో నిలవాలని జిల్లా మలేరియా అధికారి ఎం. సింహాచలం పిలుపునిచ్చారు. ఈ మేరకు వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నివారణకు ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది.ఇందులో భాగంగా శుక్రవారం ఆత్మకూరు యూపీహెచ్సీ అరుంధతివాడ పరిధిలోని నెల్లూరుపాలెం ఎస్టీ కాలనీలో ‘ఫ్రైడే – డ్రైడే’ (శుక్రవారం పొడి రోజు) కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (హెచ్ఈవో) సుధాకర్ క్షేత్రస్థాయిలో సందర్శించి, సిబ్బంది చేపడుతున్న చర్యలను పరిశీలించారు.ఈ సందర్భంగా స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో ప్రజలను ఉద్దేశించి హెచ్ఈవో సుధాకర్ మాట్లాడుతూ ప్రతి వారం నిర్వహించే ‘ఫ్రైడే – డ్రైడే’ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడటం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు.దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి కీటక జనిత వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండే పాత్రలు, టైర్లు, కొబ్బరి చిప్పలు వంటి వాటిని తొలగించాలని తెలిపారు.ఆరోగ్య శాఖ చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్న ఆయన, వ్యాధుల నియంత్రణలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చిన మహిళలు, స్థానిక ప్రజలకు కీటక జనిత వ్యాధుల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ జి. రవీందర్ రెడ్డి, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, స్థానిక కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.