Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లాలో 3 దఫాలుగా పంచాయతీ ఎన్నికలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జిల్లాలో 3 దఫాలుగా పంచాయతీ ఎన్నికలు

వార్త ముఖ్యాంశాలు

  • – మొదటి విడతగా నవంబర్ 26న కావలి డివిజన్‌లో – 2వ విడత నవంబర్ 29న గూడూరు , ఆత్మకూరు డివిజన్‌లలో – 3వ విడత డిసెంబర్ 2న నెల్లూరు డివిజన్‌లో ఇప్పటికే మున్సిపల్, కార్పొరేషన్, నగర పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను విజయవంతంగా జరిపిన రాష్ట్ర…
  • నెల్లూరు జిల్లాకు సంబంధించి మొదటి విడత నవంబర్ 26న కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో గ్రామ పంచాయతీల ఎన్నికలు జరపనుంది.
  • ఆ మండలాల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

– మొదటి విడతగా నవంబర్ 26న కావలి డివిజన్‌లో
– 2వ విడత నవంబర్ 29న గూడూరు , ఆత్మకూరు డివిజన్‌లలో
– 3వ విడత డిసెంబర్ 2న నెల్లూరు డివిజన్‌లో
ఇప్పటికే మున్సిపల్, కార్పొరేషన్, నగర పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను విజయవంతంగా జరిపిన రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసింది. నెల్లూరు జిల్లాకు సంబంధించి మొదటి విడత నవంబర్ 26న కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో గ్రామ పంచాయతీల ఎన్నికలు జరపనుంది. ఆ మండలాల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
1. అల్లూరు
2. బోగోలు
3. దగదర్తి
4. దుత్తలూరు
5. జలదంకి
6. కలిగిరి
7. కావలి
8. కొడవలూరు
9. కొండాపురం
10. వింజమూరు
11. విడవలూరు
12. వింజమూరు (వి.కె. పాడు)
ఇక నెల్లూరు జిల్లాలో 2వ విడత గ్రామ పంచాయతీల ఎన్నికలు ఆత్మకూరు డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో నవంబర్ 29న జరగనున్నాయి. ఆత్మకూరు మండలాల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
1. అనంతసాగరం
2. అనుమసముద్రంపేట
3. ఆత్మకూరు
4. చేజర్ల
5. కలువాయి
6. మర్రిపాడు
7. సంగం
8. సీతారామపురం
9. ఉదయగిరి
ఇక 29వ తేదీనే గూడూరు రెవెన్యూ డివిజన్‌లోని చిల్లకూరు, గూడూరు, కోట మండలాల్లో కూడా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక జిల్లాలో 3వ విడతగా డిసెంబర్ 2న నెల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 11 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ మండలాల వివరాలు ఇవే.
1. బుచ్చి
2. కోవూరు
3. ఇందుకూరుపేట
4. నెల్లూరు
5. మనుబోలు
6. వెంకటాచలం
7. టి.పి. గూడూరు
8. పొదలకూరు
9. ముత్తుకూరు
10. సైదాపురం
11. రాపూరు

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *