వార్త ముఖ్యాంశాలు
- *🟥జమీన్ కొత్తపాలెం సర్పంచ్ బరిలో పాపారెడ్డి కుటుంబం?**🟥జమీన్ కొత్తపాలెం పంచాయతీకి ప్రత్యేకమైన రాజకీయ చరిత్ర**🟥గతంలో తుపిలి పాలెం కాపులు మరియు గ్రామాల పెద్దలు, సమావేశమై సర్పంచ్ పదవిని విడతల వారీగా కేటాయింపు**🟥తొలి విడతలో తూపిలిపాలెం, రెండో విడతలో గంగన్నపాలెం గ్రామాలకు అవకాశం**🟥ప్రస్తుతం మూడో విడతలో జమీన్ కొత్తపాలెంకు…
- నాలుగు గ్రామాల సమాహారమైన ఈ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల వేళ ఆసక్తికర వాతావరణం నెలకొంది.గంగనపాలెం, జమీన్ కొత్తపాలెం, పాతేటిపాలెం, తూపిలిపాలెం గ్రామాలు కలిపి ఒకే పంచాయతీగా ఉన్నప్పటికీ..
- ఇక్కడి రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం, ఆనవాయితీ కొనసాగుతోంది.
*🟥జమీన్ కొత్తపాలెం సర్పంచ్ బరిలో పాపారెడ్డి కుటుంబం?**🟥జమీన్ కొత్తపాలెం పంచాయతీకి ప్రత్యేకమైన రాజకీయ చరిత్ర**🟥గతంలో తుపిలి పాలెం కాపులు మరియు గ్రామాల పెద్దలు, సమావేశమై సర్పంచ్ పదవిని విడతల వారీగా కేటాయింపు**🟥తొలి విడతలో తూపిలిపాలెం, రెండో విడతలో గంగన్నపాలెం గ్రామాలకు అవకాశం**🟥ప్రస్తుతం మూడో విడతలో జమీన్ కొత్తపాలెంకు అవకాశం దక్కవచ్చనే చర్చ స్థానికంగా సాగుతోంది**🟥 OC జనరల్ రిజర్వేషన్ అయ్యే అవకాశం విశ్వసినీయ సమాచారం – పాపారెడ్డి కుటుంబంపై చర్చ!**🟥కూటమి సర్పంచ్ అభ్యర్థిగా పాపారెడ్డి కుటుంబ సభ్యుల పేరు ప్రచారంలోకి!**———————* *✍🏽వినోద్ కుమార్ 👇🏽* వినోద్ కుమార్ *జర్నలిస్ట్**———————-*జమీన్ కొత్తపాలెం గ్రామ పంచాయతీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నాలుగు గ్రామాల సమాహారమైన ఈ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల వేళ ఆసక్తికర వాతావరణం నెలకొంది.గంగనపాలెం, జమీన్ కొత్తపాలెం, పాతేటిపాలెం, తూపిలిపాలెం గ్రామాలు కలిపి ఒకే పంచాయతీగా ఉన్నప్పటికీ.. ఇక్కడి రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం, ఆనవాయితీ కొనసాగుతోంది. పాతేటిపాలెం మినహా, మిగిలిన మూడు గ్రామాల ప్రజలు సర్పంచ్ పదవిని వంతులవారీగా దక్కించుకోవడం ఇక్కడ ముందటి నుండి వస్తున్న ఆచారం.గతంలో తుపిలి పాలెం కాపులు మరియు గ్రామాల పెద్దలు, సమావేశమై సర్పంచ్ పదవిని విడతల వారీగా కేటాయించారు.*🟥గత ఎన్నికల సమీక్ష – ఆనవాయితీ ప్రకారం చూస్తే:–**♦️మొదటి విడత:–* తూపిలిపాలెం గ్రామానికి చెందిన ఆరికాటి హేమలత (మహేంద్ర)కి అవకాశం దక్కగా, ఆ గ్రామానికి వారు సేవలు అందించారు.*♦️రెండో విడత:–* గంగనపాలెం గ్రామానికి చెందిన దుంపల పుల్లమ్మ (కోటేశ్వరరావు) కి అవకాశం దక్కింది.*🟥మూడో సారి.. జమీన్ కొత్తపాలెం వంతు!*ఇప్పుడు మూడో విడత పంచాయితీ ఎన్నికల సమయం ఆసన్నం కాగా, ఈసారి సర్పంచ్ స్థానాన్ని అధిష్టించే అదృష్టం జమీన్ కొత్తపాలెం గ్రామానికి దక్కింది. మరీ ముఖ్యంగా ఈసారి ఈ స్థానం ‘ఓసీ జనరల్’ (OC General) కేటగిరీకి వస్తుందని విశ్వసినీయ సమాచారం. రాజకీయ వర్గాల్లో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.*🟥పోరులో కూటమి అభ్యర్థి.. ఖరారైనట్టేనా?:–*జమీన్ కొత్తపాలెం గ్రామానికి అవకాశం రావడం, స్థానికంగా బలమైన నాయకత్వం ఉండే కుటుంబం పోటీలో ఉండటంతో గ్రామ పంచాయతీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈసారి కూటమి తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పాపారెడ్డి కుటుంబ సభ్యులు బరిలో దిగడం 100% ఖరారైనట్లేనని పంచాయతీ ప్రజల నడుమ విస్తృత ప్రచారం జరుగుతోంది.పాపారెడ్డి కుటుంబానికి ఉన్న ప్రజాదరణ, గ్రామంలో వారి సేవలు, ప్రజా సంబంధాల దృష్ట్యా వారి అభ్యర్థిత్వానికే కూటమి పెద్దలు కూడా మొగ్గు చూపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముందస్తు అవగాహన, సుదీర్ఘ రాజకీయ ఆనవాయితీకి కట్టుబడి ఉండే ఈ పంచాయతీలో ఈసారి ఎన్నికలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

