Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

పెంచలకోనలో సంతానలక్ష్మిగా ఆదిలక్ష్మి అమ్మవారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పెంచలకోనలో సంతానలక్ష్మిగా ఆదిలక్ష్మి అమ్మవారు ▪️వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు..
  • ▪️ భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన..

పెంచలకోనలో సంతానలక్ష్మిగా ఆదిలక్ష్మి అమ్మవారు

▪️వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు..

▪️ భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన..

పెంచలకోన, అక్టోబర్ 17: సిరిసంపదలు, సంతాన సౌభాగ్యాలను ప్రసాదించే జగన్మాతగా కొలువుదీరిన ఆదిలక్ష్మి అమ్మవారు పెంచలకోన క్షేత్రంలో సంతానలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామివారి పట్టమహిషి ఆదిలక్ష్మి అమ్మవారికి ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం విశేష పూజా కార్యక్రమాలు భక్తి ప్రపత్తులతో వైభవంగా జరిగాయి. ఉదయం అమ్మవారికి సంప్రదాయబద్ధంగా వస్త్ర సమర్పణ చేసి, వివిధ రకాల సుగంధ పుష్పాలతో మనోహరంగా అలంకరించారు. అనంతరం ఉదయం 10 గంటలకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించారు. సాయంత్రం 6 గంటలకు సంతానలక్ష్మి అలంకారంలో అమ్మవారిని పద్మపీఠంపై సుందరంగా అలంకరించి ప్రాకారోత్సవం నిర్వహించారు. అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. అనంతరం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. లోకక్షేమం, కుటుంబ సౌభాగ్యం, సంతాన ప్రాప్తి కలగాలని జగన్మాతను ప్రార్థిస్తూ భక్తులు పూజలు చేశారు. శరన్నవరాత్రుల సందర్భంగా పెంచలకోన క్షేత్రం అమ్మవారి నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆదిలక్ష్మి అమ్మవారి కరుణాకటాక్షాలు తమ కుటుంబాలపై ఉండాలని భక్తులు వేడుకుంటూ భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *