Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

*స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 163 BNSS , సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం*అనుమతి లేకుండా సభలు, ఊరేగింపులు, రోడ్‌షోలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం**జిల్లా ఎస్పీ శ్రీ జగదీశ్ ఆదహళ్లి, ఐపీఎస్ గారు*పల్నాడు జిల్లా వ్యాప్తంగా జరగబోయే పట్టణ స్థానిక సంస్థలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల…
  • ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీస్ అధికారులకు లేదా 100/112 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.
  • సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం*అనుమతి లేకుండా సభలు, ఊరేగింపులు, రోడ్‌షోలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం**జిల్లా ఎస్పీ శ్రీ జగదీశ్ ఆదహళ్లి, ఐపీఎస్ గారు*పల్నాడు జిల్లా వ్యాప్తంగా జరగబోయే పట్టణ స్థానిక సంస్థలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత దృష్ట్యా సెక్షన్ 163 BNSS, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ లు అమలులో ఉన్నాయి అని జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ ఆదహళ్లి, ఐపీఎస్ గారు శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు.ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, నిర్వాహకులు, వారి ప్రతినిధులు బహిరంగ సభలు, ఊరేగింపులు, రోడ్‌షోలు నిర్వహించాలన్నా, మైకులు, లౌడ్‌స్పీకర్లు లేదా డ్రోన్ కెమెరాలను వినియోగించాలన్నా సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలని ఎస్పీ గారు స్పష్టం చేశారు.ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లా వ్యాప్తంగా కర్రలు, ఆయుధాలు, ఇతర ప్రమాదకర వస్తువులను వెంట తీసుకెళ్లడం, నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది చట్టవిరుద్ధంగా గుమిగూడడం నిషేధమని తెలిపారు.రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, కమ్యూనిటీ నాయకులు, ప్రజలు పోలీసు శాఖ జారీ చేసిన ఉత్తర్వులు, నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.నిబంధనలను ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే వారిని ఉపేక్షించబోమని, అటువంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు హెచ్చరించారు.జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, జిల్లా ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ గారు కోరారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీస్ అధికారులకు లేదా 100/112 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *