వార్త ముఖ్యాంశాలు
- ఆత్మకూరు అక్టోబర్ 17 (పున్నమి ప్రతినిధి):ఆత్మకూరు రూరల్ మండలం మహిమలూరు పంచాయతీ పరిధిలోని బసవరాజుపాలెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.
- గ్రామానికి చెందిన 35 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి.
- రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమక్షంలో, రూరల్ మండల టీడీపీ మహిళా అధ్యక్షురాలు కొప్పుల రమణమ్మ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.గ్రామానికి చెందిన బీసీ, ఎస్సీ,ఎస్టీ వర్గాల కుటుంబాలు కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు మద్దతుగా టీడీపీలో చేరినట్లు…
మంత్రి ఆనం సమక్షంలో టీడీపీలోకి 35 కుటుంబాలు..
అభివృద్ధి, సంక్షేమానికి మద్దతుగా పసుపు కండువా
ఆత్మకూరు అక్టోబర్ 17 (పున్నమి ప్రతినిధి):ఆత్మకూరు రూరల్ మండలం మహిమలూరు పంచాయతీ పరిధిలోని బసవరాజుపాలెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన 35 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమక్షంలో, రూరల్ మండల టీడీపీ మహిళా అధ్యక్షురాలు కొప్పుల రమణమ్మ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.గ్రామానికి చెందిన బీసీ, ఎస్సీ,ఎస్టీ వర్గాల కుటుంబాలు కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు మద్దతుగా టీడీపీలో చేరినట్లు నాయకులు తెలిపారు. మంత్రి ఆనం వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని, బసవరాజుపాలెం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.