Thursday, 1 October 2026
  • Home  
  • జనహృదయనేత గండి చిన వెంకటరామయ్య కన్నుమూత వావిలపాడు గ్రామంలో విషాద ఛాయలు
- విశాఖపట్నం

జనహృదయనేత గండి చిన వెంకటరామయ్య కన్నుమూత వావిలపాడు గ్రామంలో విషాద ఛాయలు

వావిలపాడు గ్రామానికి చెందిన ప్రముఖుడు, కుటుంబ పెద్ద, జనహృదయనేత శ్రీ గండి చిన వెంకటరామయ్య (టిక్కనాయుడు) గురువారం విశాఖపట్నంలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాల మరణం చెందారు. ఆయన మృతి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, గ్రామ ప్రజలను తీవ్ర విషాదానికి గురిచేసింది. కుటుంబ శ్రేయస్సుతో పాటు వావిలపాడు గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పలువురు పేర్కొన్నారు. ప్రజల పట్ల ఆప్యాయత, సమాజ సేవ పట్ల అంకితభావంతో ఆయన అందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన భౌతిక వియోగం కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, గ్రామ ప్రజలకు తీరని లోటని పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సేవలు, ఆశయాలు, ప్రజలతో మమేకమైన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. శ్రీ గండి చిన వెంకటరామయ్య పార్థివ దేహాన్ని గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం వరకు వావిలపాడులోని ఆయన స్వగృహంలో బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, గ్రామ ప్రజల సందర్శనార్థం ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని భరించే మనోధైర్యాన్ని ప్రసాదించాలని పలువురు ప్రార్థించారు.

వావిలపాడు గ్రామానికి చెందిన ప్రముఖుడు, కుటుంబ పెద్ద, జనహృదయనేత శ్రీ గండి చిన వెంకటరామయ్య (టిక్కనాయుడు) గురువారం విశాఖపట్నంలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాల మరణం చెందారు. ఆయన మృతి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, గ్రామ ప్రజలను తీవ్ర విషాదానికి గురిచేసింది.
కుటుంబ శ్రేయస్సుతో పాటు వావిలపాడు గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పలువురు పేర్కొన్నారు. ప్రజల పట్ల ఆప్యాయత, సమాజ సేవ పట్ల అంకితభావంతో ఆయన అందరి అభిమానాన్ని చూరగొన్నారు.
ఆయన భౌతిక వియోగం కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, గ్రామ ప్రజలకు తీరని లోటని పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సేవలు, ఆశయాలు, ప్రజలతో మమేకమైన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.
శ్రీ గండి చిన వెంకటరామయ్య పార్థివ దేహాన్ని గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం వరకు వావిలపాడులోని ఆయన స్వగృహంలో బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, గ్రామ ప్రజల సందర్శనార్థం ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని భరించే మనోధైర్యాన్ని ప్రసాదించాలని పలువురు ప్రార్థించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.