*చిన్నారులను అద్భుత ప్రదర్శనలను చూసి అభినందించిన పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డీకే అరుణ*
*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా :: తేదీ:: 25/04/2026*
*ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం ముగింపు సమావేశంలో చిన్నారుల అద్భుత కళా ప్రదర్శనలను చూసి వీక్షకులు ఆనందోత్సాహాలతో కేరింతలు వేశారని వైష్ణవి ఆర్ట్స్ డాన్స్ అకాడమీ వ్యవస్థాపకులు విజయలక్ష్మి గారు తెలియజేశారు, చిన్నారుల ప్రతిభను గౌరవ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డీకే అరుణ గారు అభినందించారని ఆమె తెలియజేశారు దాదాపుగా అయిదు నృత్య ప్రదర్శనలను చేయించడం జరిగిందని పిల్లల్లో దాగి ఉన్న నృత్య కళా ప్రతిభను వెలికి తీసేందుకు ఈ వేసవిలో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు సమ్మర్ క్యాంపు లో బాల బాలికలు శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలియజేశారు ప్రోత్సహిస్తున్న శ్రేయోభిలాషులు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు*


