గొట్టిపల్లిలో VMM ఆధ్వర్యంలో అడ్వకసీ సమావేశం.. 30 మంది కీలక వ్యక్తుల భాగస్వామ్యం
విశాఖపట్నం జిల్లా, ఆనందపురం, సెప్టెంబర్ 28: గ్రామీణ ప్రాంతాల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు, బాధితులకు అందుబాటులో ఉన్న వైద్య సేవలను తెలియజేసే లక్ష్యంతో ఆనందపురం మండలం గొట్టిపల్లి గ్రామంలో వాసవ్య మహిళా మండలి (VMM) ఆధ్వర్యంలో, సంత్వనా కార్యక్రమంలో భాగంగా లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ సహకారంతో మానసిక ఆరోగ్య అవగాహన, అడ్వకసీ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సచివాలయ అడ్మిన్ సెక్రటరీ T. ప్రశాంత్ మాట్లాడుతూ మానసిక ఆరోగ్య పరిరక్షణకు VMM చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
VMM ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ హేమ మానసిక అనారోగ్య లక్షణాలు, చికిత్సా విధానాలు, విశాఖపట్నంలో అందుబాటులో ఉన్న వైద్య సేవలను వివరించారు. ప్రాజెక్ట్ సూపర్వైజర్ M. నాగరాజు సంత్వనా కార్యక్రమం ద్వారా బాధితులకు అందిస్తున్న గుర్తింపు, వైద్య సేవలకు రిఫరల్, చికిత్స, కుటుంబ సభ్యులకు అవగాహన వంటి సేవలను వివరించారు.
ఈ సమావేశంలో ఆనందపురం ప్రెస్ అసోసియేషన్ అధ్యక్షులు D. విజయ్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు Y. గోవింద్ కుమార్, RMP వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం 30 మంది కీలక వ్యక్తులు హాజరయ్యారు.
గ్రామీణ ప్రాంతాల్లో మానసిక ఆరోగ్య సేవలు ప్రజలకు చేరువ కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని VMM బృందం కోరింది. కార్యక్రమాన్ని కమ్యూనిటీ యానిమేటర్లు రమణమ్మ, పావని సమన్వయం చేశారు.


