ఉదయగిరి: దాసరిపల్లి–సోమలరేగడ హైవే వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కావలి నుంచి ఉదయగిరి వైపు గన్నేపల్లి మాజీ సర్పంచ్ నెల్లూరు వెంకటస్వామి కారులో ప్రయాణిస్తుండగా, మార్గమధ్యంలో రోడ్డు దాటుతున్న గేదెలు ఎదురయ్యాయి. వాటిని తప్పించేందుకు ప్రయత్నించగా కారు అదుపుతప్పి ఓ దూడను ఢీకొట్టింది. ప్రమాదంలో దూడ అక్కడికక్కడే మృతి చెందింది. మరో గేదె తీవ్రంగా గాయపడింది. ఢీకొన్న ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. అయితే కారులో ప్రయాణిస్తున్న నెల్లూరు వెంకటస్వామికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. రహదారిపై పశువులు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

గేదెలను తప్పించబోయి దూడను ఢీకొన్న కారు.. ఒక గేదె మృతి, మరో గేదెకు తీవ్ర గాయాలు