ఖమ్మం, జులై
(పున్నమి న్యూస్):
బీజేపీ మండల ప్రవాస్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం టూ టౌన్ ప్రభారిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణకు టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. టూ టౌన్ అధ్యక్షుడు ధనియాకుల వెంకట్ నారాయణ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అభ్యర్థి శ్రీలత, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏళ్ళ రావు గౌడ్, జిల్లెల్ల నాగరాజు, దాసరి వీరభద్రం, బోయినపల్లి సురేష్తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని గల్లా సత్యనారాయణ పిలుపునిచ్చారు.

