ఖానాపూర్, పున్నమి ప్రతినిధి: ఖానాపూర్ మండలం మనుబోతుల గడ్డ గ్రామానికి చెందిన బలరాజు (40) సంగం కాలువలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, బలరాజు కాలువలో మృతిచెందినట్లు గుర్తించారు.
మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. కుటుంబానికి ఆధారంగా ఉన్న బలరాజు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉండగా, ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది.
