ఖమ్మం నగరంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న AIKMS జాతీయ మహాసభలకు సర్వం సిద్ధమైంది. “వ్యవసాయాన్ని కాపాడండి.. రైతాంగాన్ని రక్షించండి” అనే నినాదంతో ఈ మహాసభలను నిర్వహిస్తున్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమాజంలో చైతన్యం తీసుకురావడంతో పాటు శ్రమకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యతను నేటి తరానికి గుర్తుచేయడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహాసభల ప్రారంభంలో భాగంగా ఈరోజు ఖమ్మం పేవిలియన్ మైదానం నుంచి ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల వరకు భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు, కార్మికులు, ప్రతినిధులు పాల్గొననున్నారు.



